
తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
తెలంగాణ మోడల్ స్కూల్ రాష్ట్ర ఉత్తిర్ణత 93 .3% తో అగ్ర గామిగా నిలిచింది.@
💐 *పదికి 10 పాయింట్లు సాధించిన విద్యార్థులు 3419 మంది*
👉హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో 3419 మంది విద్యార్థులు పదికి 10 పాయింట్లు సాధించారు.
గవర్నమెంట్ పాఠశాలల్లో 18 మంది, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 28, తెలంగాణ గురుకుల పాఠశాలలు(సొసైటీ) 2, తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలు 6, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 0(సున్నా),ఎయిడెడ్ పాఠశాలల్లో 28, ప్రైవేటు పాఠశాలల్లో 3311, బీసీ వెల్ఫేర్ పాఠశాలల్లో ఒకరు, కేజీబీవీ పాఠశాలల్లో 0(సున్నా), మోడల్ స్కూల్స్లో 25 మంది విద్యార్థులు పదికి 10 పాయింట్లు సాధించారు.
తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్లో తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం 85.63గా ఉంది. బాలుర ఉత్తీర్ణతా శాతం 84.70గా ఉంటే, బాలికల ఉత్తీర్ణతా శాతం 86.57గా ఉంది. ఫలితాల్లో 95.13 శాతం ఉత్తీర్ణతతో వరంగల్ జిల్లా మొదటి స్థానంలో నిలిస్తే, హైదరాబాద్ 76.23శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. పది స్కూళ్లలో 0 శాతం ఉత్తీర్ణత నమోదయింది. పరీక్షలు నిర్వహించిన నెలరోజుల్లోనే ఫలితాలు విడుదల చేశారు. జూన్ 15నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈనెల 26వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఫీజు స్వీకరించనున్నారు.
జిల్లాల వారీగా
పదవతరగతి ఫలితాలు
👉వరంగల్ -95.13%
👉మహబూబ్ నగర్ -91.19%
👉మెదక్ -90.74%
👉నిజామాబాద్ -90.04%
👉కరీంనగర్ – 86.4%
👉ఖమ్మం -84.62%
👉నల్గొండ -83.75%
👉ఆదిలాబాద్ -82.33%
👉రంగారెడ్డి -82.07%
👉హైదరాబాద్ -76.23%